యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు సెప్టెంబర్ 27 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న దేవర చిత్రంపై అంతకుమించి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ హైప్ ను మరింత పెంచేలా దేవర చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
ట్రైలర్ లో మాస్ ఎలిమెంట్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. దేవర పాత్రను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓన్ చేసుకున్నాడు. డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. ధైర్యాన్ని సంపే భయాన్ని అయితా అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అలరిస్తోంది. విజువల్స్ చాలా బాగున్నాయి. అనిరుధ్ రవి చందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ను మరింత హైలైట్ చేసేలా ఉంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం ట్రైలర్ ను చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసేలా ఉంది. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్, పవిత్రా లోకేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.