‘దేవర’కి అక్కడ 600 కోట్లు వస్తాయా ?

‘దేవర’కి అక్కడ 600 కోట్లు వస్తాయా ?

Published on Sep 2, 2024 7:00 AM IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. ఐతే, ఇండియన్ సినిమా గ్లోబలైజ్ అయిపోయింది. వరల్డ్ వైడ్ గా ఇండియన్ సినిమాకి ఫ్యాన్స్ పెరిగిపోవడంతో పాటు కోట్లు కాసులు కురిపించే విధంగా మార్కెట్ భారీ స్థాయిలో బిల్డ్ అయిపోయింది. అలాగే, ఓవర్సీస్ మార్కెట్ కూడా ఇండియన్ సినిమాకి పెద్ద బలంగా మారింది. ముఖ్యంగా అమెరికా జపాన్ రష్యాలో కొత్త మార్కెట్ ఓపెన్ అయ్యి ఓవర్సీస్ కలెక్షన్లలో మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి.

అందుకే, మన హీరోలు కూడా ఓవర్సీస్ మార్కెట్ మీదే ఆశలు పెట్టుకున్నారు. ఒకప్పుడు ఓవరాల్ కలెక్షన్ 250 – 300 కోట్లు ఉండేది. కానీ, ఇప్పుడు ఒక్క ఓవర్సీస్ మార్కెట్ నుంచే ఆ రేంజ్ నెంబర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ‘దేవర’ సినిమా ఓవర్సీస్ లో ప్రీ సేల్స్ తో దుమ్ము రేపుతుంది. సెప్టెంబర్ 27న రాబోతున్న దేవర అప్పుడే లక్ష డాలర్ల ప్రీ సేల్స్ కి దగ్గరలో ఉంది. దీంతో, దేవర కి ఓవర్సీస్ టార్గెట్ ఈజీగా 600 కోట్లు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మరి, ‘దేవర’ సినిమాకి అక్కడ 600 కోట్లు వస్తాయా ?, లేదా ? అనేది చూడాలి.

కాగా ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ లతో పాటు శ్రీకాంత్ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు