‘ఎన్టీఆర్ – బాబీ డియోల్’లపై యాక్షన్ షెడ్యూల్

‘ఎన్టీఆర్ – బాబీ డియోల్’లపై యాక్షన్ షెడ్యూల్

Published on Jun 25, 2024 3:00 AM IST

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మొన్నటివరకూ ఆగస్టులో స్టార్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ, తాజాగా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ప్రశాంత్ నీల్ ఓ యాక్షన్ షెడ్యూల్ వేశాడని.. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ తో పాటు యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ మరియు మిగిలిన నటీనటులు కూడా జాయిన్ అవుతారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

ఏది ఏమైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటిస్తోందని తెలుస్తోంది. మరి, అలియా భట్ నిజంగానే ఎన్టీఆర్ సరసన నటిస్తే.. ఆ క్రేజే వేరు. అలాగే, ఈ సినిమాలో మరో హీరోయిన్ కి కూడా స్కోప్ ఉందని.. ఆ పాత్రలో మరో స్టార్ హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. అన్నట్టు ఆ మధ్య ఈ పవర్‌ హౌస్ ప్రాజెక్ట్ కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి అంటూ ఈ చిత్రబృందం ఓ మెసేజ్ ను కూడా పోస్ట్ చేసింది. మొత్తానికి ఈ సినిమా పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు