‘టెంపర్’ లాంటి సక్సెస్ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చేస్తున్న 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’. తన 25వ సినిమా చాలా డిఫరెంట్ గా ఉండాలని క్రేజీ డైరెక్టర్ సుకుమార్ తో కలిసి, తన లుక్ ని పూర్తిగా మార్చుకొని చేస్తున్న సినిమానే నాన్నకు ప్రేమతో. ఇటీవలే 80 రోజుల లాంగ్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని లండన్ నుంచి తిరిగి వచ్చిన ఈ చిత్ర టీం దసరా తర్వాత మరో లాంగ్ షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా చాలా రోజుల నుంచి ఎన్.టి.ఆర్ తదుపరి సినిమా ఎవరితో ఉంటుందా అనేదానిపైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
ఇటీవలే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తదుపరి సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో ఖరారైందని వార్తలు వచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్న ఈ సినిమా జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ అండ్ టీం తన తదుపరి సినిమా అధికారిక లాంచ్ కోసం టైం ని ఫిక్స్ చేసారు. దసరాని పురష్కరించుకొని ఈ నెల 25న ఎన్.టి.ఆర్ – కొరటాల శివ సినిమాని లాంచ్ చేయనున్నారని సమాచారం. ఈ లాంచ్ అయిన తర్వాతే ఎన్.టి.ఆర్ నాన్నకు ప్రేమతో షూట్ కోసం స్పెయిన్ వెలతాడట. మరి ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.


