మెలోడి సాంగ్‌గా ఆకట్టుకుంటున్న ‘నువ్వే నాకు లోకం’

ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘జనక అయితే గనక’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు సిద్ధమయ్యింది. రిలీజ్ డేట్‌ని కూడా అనౌన్స్ చేసిన ఈ సినిమా మరోసారి వాయిదా పడటంతో, ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్‌గా అక్టోబర్ 12న రానుంది ఈ సినిమా. ఇక ఈ సినిమా నుంచి తాజాగా ‘నువ్వే నాకు లోకం’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ చిత్రానికి విజయ్ బుల్గనిన్ అద్భుతమైన సంగీతం అందించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లిరికల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది. తాజాగా ఈ హార్ట్ టచింగ్ మెలోడి సాంగ్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కృష్ణకాంత్ అందించిన చక్కటి సాహిత్యానికి కార్తిక్ తనదైన వాయిస్‌తో ఈ పాటను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాడు.

ఈ పాటతో ఈ మూవీపై అంచనాలు మరింతగా పెరిగాయి. బండ్ల సందీప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో సంకీర్తన విపిన్, రాజేంద్ర ప్రసాద్, గోపరాజు రమణ, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version