రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ‘ఓ భామ అయ్యో రామ’ టీజర్ రిలీజ్

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ‘ఓ భామ అయ్యో రామ’ టీజర్ రిలీజ్

Published on Mar 24, 2025 9:00 PM IST

డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. వేసవిలో ఎంటర్‌టైన్ చేయనున్న ఈ చిత్రం టీజర్‌ను తాజాగా విడుదల చేశారు మేకర్స్‌.

ఈ సందర్బంగా నిర్మాత హరీష్‌ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా చేసిన నా టెక్నిషియన్స్‌, ఆర్టిస్ట్‌లు ఎంతో సపోర్ట్‌ చేసి మంచి ప్రొడక్ట్‌ను తీసుకొచ్చారు. బెస్ట్‌ క్వాలిటీ సినిమా ఇవ్వబోతున్నాం. పూర్తి ఎంటర్‌టైనింగ్‌గా రాబోతున్న ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మీ హృదయాలను దోచుకుంటుంది. తప్పకుండా నిర్మాతగా ఓ మంచి సినిమాను ఇవ్వబోతున్నాం అనే నమ్మకం ఉంది’ అని అన్నారు.

హీరోయిన్‌ మాళవిక మాట్లాడుతూ.. ‘ఈ సినిమాపై నాకు చాలా నమ్మకం ఉంది. నాకు తెలుగులో ఓ మంచి సినిమాతో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.

రామ్‌ గోధల మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరికి సినిమా తీయాలనే కల ఉంటుంది. దర్శకుడిగా తన పేరును వెండితెరపై చూసుకోవాలని ఉంటుంది. ఈ రోజు నేను దర్శకుడి నా పేరు చూసుకోవడానికి కారణం హీరో సుహాస్‌. నిర్మాత హరీష్‌ కథ చెప్పగానే క్వాలిటీగా తీద్దామని చెప్పాడు. ఎక్కడా రాజీపడకుండా సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ ప్రొడక్ట్‌ క్వాలిటీగా రావడానికి ఆయనే కారణం. మణికందన్‌ ఫోటోగ్రఫీతో ఈ సినిమాను చాలా కలర్‌ఫుల్‌గా మలిచాడు. రథన్‌ ఈ లవ్‌స్టోరీకి చాలా మంచి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో ఉన్న ఆరుపాటలు వేటికవే అనే విధంగా బ్యూటిఫుల్‌గా ఉంటాయి’ అని అన్నారు.

హీరో సుహాస్‌ మాట్లాడుతూ.. ‘దర్శకుడు రామ్‌ నాకు ఎప్పట్నుంచో తెలుసు. చెప్పిన వెంటనే నాకు లవ్‌స్టోరీ ఎందుకు అన్నాను. కానీ కన్వీన్స్‌ చేశాడు. ఈ చిత్రంలో సాంగ్స్‌ చాలా బాగుంటాయి. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా చాలా క్వాలిటీగా సినిమాను తీస్తున్నాడు. సినిమాలో ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది. లవ్‌స్టోరీ కొత్తగా ఉంటుంది. పాటలు చాలా బాగుంటాయి. తప్పకుండా సినిమా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్పిరిట్‌ మీడియా ప్రవీణ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ బ్రహ్మా కడలి, ఆదిత్య మ్యూజిక్‌ నిరంజన్‌, మణికందన్‌, సుహాస్‌ మెహిన్‌, సాత్విక్‌ తదితరలు పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు