స‌మీక్ష: OMG(ఓ మంచి ఘోస్ట్) – రొటీన్ హార్ర‌ర్ కామెడీ

స‌మీక్ష: OMG(ఓ మంచి ఘోస్ట్) – రొటీన్ హార్ర‌ర్ కామెడీ

Published on Jun 22, 2024 3:03 AM IST
OMG (O Manchi Ghost) Movie Review in Telugu

విడుదల తేదీ : జూన్ 21, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: వెన్నెల కిషోర్, షక‌ల‌క శంక‌ర్, నందితా శ్వేత‌, న‌వ‌మి గాయ‌క్, న‌వీన్ నేని, రజ‌త్ రాఘ‌వ‌, ర‌ఘు బాబు త‌దితరులు

దర్శకుడు: శంక‌ర్ కె.మార్తాండ్

నిర్మాతలు : డా.అబినికా ఇనాబతుని

సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫీ: ఆండ్రూ బాబు

ఎడిటింగ్: ఎంఆర్.వ‌ర్మ‌

సంబంధిత లింక్స్: ట్రైలర్

హార్ర‌ర్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన “ఓ మంచి ఘోస్ట్”(OMG) ప్రేక్ష‌కుల్లో మంచి బ‌జ్ ను క్రియేట్ చేసింది. వెన్నెల కిషోర్, నందితా శ్వేత ఈ సినిమాలో న‌టిస్తుండ‌టంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. శంక‌ర్ మార్తాండ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం నేడు థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో స‌మీక్ష‌లో చూద్దాం.

 

క‌థ:

చైత‌న్య‌(ర‌జ‌త్ రాఘ‌వ‌), పావురం(ష‌క‌ల‌క శంక‌ర్), ర‌జియా(న‌వ‌మి గాయక్), ల‌క్ష్మ‌ణ్(న‌వీన్ నేని)ల‌కు డ‌బ్బులు చాలా అవ‌స‌రం ఉంటాయి. వారంతా క‌లిసి డ‌బ్బులు సంపాదించాల‌ని చూస్తారు. ఈ క్ర‌మంలో తక్కువ స‌మ‌యంలో డ‌బ్బులు సంపాదించేందుకు చైతన్య ఓ ప్లాన్ వేస్తాడు. త‌న బంధువు అయిన కీర్తి(నందితా శ్వేత)ను మిగ‌తా ముగ్గురితో క‌లిసి అతడు కిడ్నాప్ చేస్తాడు. అయితే, కీర్తికి సంబంధించిన ఓ సీక్రెట్ వారికి తెలియ‌దు. ఈ క్ర‌మంలో ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటాయి అనేది సినిమా క‌థ‌.

 

ప్ల‌స్ పాయింట్స్:

నందితా శ్వేత పాత్ర‌కు సంబంధించిన ట్విస్ట్ ఈ సినిమాకు కొత్త‌ద‌నాన్ని తీసుకొస్తుంది. ఫ‌స్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ తో క‌థ ఆస‌క్తిక‌రంగా ముందుకు సాగుతుంది. వెన్నెల కిషోర్, ష‌క‌ల‌క శంక‌ర్ త‌మ కామెడీతో ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తారు.

ఈ సినిమాకు త‌క్కువ బ‌డ్జెట్ కేటాయించినా, ఇందులోని వీఎఫ్ఎక్స్ వ‌ర్క్స్ క్వాలిటీ ఈ సినిమాను హై బ‌డ్జెట్ మూవీగా మార్చాయి. అనూప్ రూబెన్స్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స‌న్నివేశాల‌కు అనుగుణంగా బాగుంది. నందితా శ్వేత‌, నవ‌మి గాయ‌క్ మంచి న‌ట‌న‌తో ఆకట్టుకున్నారు.

 

మైన‌స్ పాయింట్స్:

ఈ సినిమా క‌థ‌లో ఆక‌ట్టుకునే అంశం ఉన్న‌ప్ప‌టికీ, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం రొటీన్ గా అనిపిస్తుంది. హార్ర‌ర్ కామెడీపైనే ఎక్కువ దృష్టిపెట్ట‌డంతో ప్రేక్ష‌కుల‌కు సినిమాపై ఇంట్రెస్ట్ త‌గ్గుతుంది. స్క్రీన్ ప్లే లో కూడా ఎలాంటి కొత్త‌ద‌నం క‌నిపించ‌లేదు. వెన్నెల కిషోర్, ష‌క‌ల‌క శంక‌ర్ పాత్ర‌ల‌తోనే నెట్టుకొచ్చే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లుగా కనిపించింది. ర‌జ‌త్ రాఘ‌వ‌, నాగినీడు పాత్ర‌లు ఏమాత్రం ఆక‌ట్టుకోవు.

మిగతా హార్ర‌ర్ సినిమాల్లోలా ఇందులోనూ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. కానీ, అది ఎలాంటి ఎమోష‌న్ ను క్రియేట్ చేయ‌దు. ఈ సినిమా టైటిల్ కు స‌రైన‌ న్యాయం చేయ‌లేకయారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ఇంకాస్త బాగా హ్యాండిల్ చేసి ఉంటే, క‌థ‌పై మంచి ప్ర‌భావం చూపేది. సెకండాఫ్ లోని రొటీన్ సీన్స్ విసిగిస్తాయి.

 

సాంకేతిక విభాగం:

ఈ సినిమాలోని పాట‌లు పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయినా, బీజీఎం బాగుంది. ఆండ్రూ బాబు అందించిన‌ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. ఎడిటింగ్ వ‌ర్క్ ప‌ర్వాలేదు. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. ద‌ర్శ‌కుడు శంక‌ర్ కె.మార్తాండ్ పూర్తిగా కామెడీపైనే ఆధార‌ప‌డ‌కుండా, కాస్త సీరియ‌స్ స‌న్నివేశాల‌పై ఫోక‌స్ పెట్టి ఉండాల్సింది. అయితే సినిమా లెంగ్తీగా లేక‌పోవ‌డం మెచ్చుకోత‌గ్గ విష‌యం.

 

తీర్పు:

ఓవ‌రాల్ గా ఓ మంచి ఘోస్ట్ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఐడియా ఉన్న‌ప్ప‌టికీ, దాన్ని నెరేట్ చేసిన విధానం బాలేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఆక‌ట్టుకున్నా, సెకండ్ హాప్ లో రొటీన్ సీన్స్ విసిగించాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను స‌రిగ్గా హ్యాండిల్ చేయ‌లేక‌పోయారు. ఎమోష‌న్ కూడా మిస్ అయ్యింది. వెన్నెల కిషోర్, ష‌క‌ల‌క శంక‌ర్, నందితా శ్వేత‌, న‌వ‌మి గాయ‌క్ లు అల‌రించినా, సినిమాలో ఆక‌ట్టుకునే అంశం మిస్ అయ్యింది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు