గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా వివిధ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
అయితే, తమిళ్లో ఈ సినిమా రిలీజ్‌కు అడ్డంకులు ఏర్పడ్డాయని తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా రిలీజ్‌పై అయోమయం క్రియేట్ అయ్యింది. లైకా ప్రొడక్షన్స్ దర్శకుడు శంకర్ తమతో ‘ఇండియన్-3’ సినిమా చేస్తాడని.. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ను తమిళనాట రిలీజ్ చేస్తున్నాడని.. ఈ సినిమా రిలీజ్‌ను అడ్డుకోవాలని లైకా ప్రొడక్షన్స్ తమిళ నిర్మాతల కౌన్సిల్లో ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
కానీ, ఇప్పుడు అవేవీ కూడా నిజం కాదని తెలుస్తోంది. ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ అందరూ అనుకుంటున్నట్లుగా సజావుగా సాగనుందని తమిళ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రాక్‌ఫోర్ట్ ఎంటర్టైన్మెంట్ క్లారిటీ ఇచ్చారు. జనవరి 10న ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ ఖాయమని.. ఈ సినిమా రిలీజ్‌కు రూట్ క్లియర్ అయ్యిందని సదరు సంస్థ పేర్కొంది. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.