Odela 2 : హై వోల్టేజ్ హార్రర్, థ్రిల్లింగ్ విజువల్స్‌తో ఆకట్టుకున్న ‘ఓదెల 2’ ట్రైలర్

Odela 2 : హై వోల్టేజ్ హార్రర్, థ్రిల్లింగ్ విజువల్స్‌తో ఆకట్టుకున్న ‘ఓదెల 2’ ట్రైలర్

Published on Apr 8, 2025 4:50 PM IST

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ సీక్వెల్ చిత్రాల్లో ‘ఓదెల 2’ కూడా ఒకటి. దర్శకుడు సంపత్ నంది నిర్మాణంలో అశోక్ తేజ డైరెక్ట్ చేస్తున్న ఈ హార్రర్ థ్రిల్లిర్ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇక నాగసాధువుగా, పవర్‌ఫుల్ శివశక్తి పాత్రలో ఆమె పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్ కానుందని చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్ కూడా ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.

తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పూర్తి హార్రర్, థ్రిల్లింగ్ విజువల్స్‌తో ఈ ట్రైలర్ కట్ ఆద్యంతం ఆకట్టుకుంది. కొన్ని హై వోల్టేజ్ షాట్స్ ప్రేక్షకులను స్టన్ చేస్తున్నాయి. హార్రర్‌తో పాటు థ్రిల్లింగ్ అంశాలు.. డివోషనల్ కంటెంట్ ఈ సినిమాకు మేజర్ అసెట్స్‌గా ఉండబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక యాక్షన్‌కు ఏమాత్రం కొదువ లేదని.. గ్రాఫిక్స్ వర్క్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని ఈ ట్రైలర్ చెబుతోంది.

హెబ్బా పటేల్, వశిష్ట సింహా, మురళీ శర్మ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా సంపత్ నంది, డి. మధు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఏప్రిల్ 17న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు