అఫీషియల్: ‘ఆయ్’.. ఓటిటిలో వచ్చేస్తున్నారండి..

అఫీషియల్: ‘ఆయ్’.. ఓటిటిలో వచ్చేస్తున్నారండి..

Published on Sep 7, 2024 3:06 PM IST

రీసెంట్ గా మన తెలుగు సినిమా దగ్గర వచ్చిన హిట్ చిత్రాల్లో “మ్యాడ్” హీరో నార్నె నితిన్ హీరోగా నయన్ సారిక హీరోయిన్ గా దర్శకుడు అంజి కే మణిపుత్ర తెరకెక్కించిన చిత్రం “ఆయ్” కూడా ఒకటి. మరి ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం కానుకగా వచ్చిన టాలీవుడ్ చిత్రాల్లో మంచి లాభాలు అందించిన సినిమాగా అయితే ఇది నిలిచింది.

యూత్ లో సాలిడ్ హిట్ అయ్యిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటిలో ఆడియెన్స్ ని అలరించేందుకు సిద్ధం అయ్యింది. మరి ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులని ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా వీరు ఈ వినాయక చవితి కానుకగా స్ట్రీమింగ్ డేట్ ని అనౌన్స్ చేసేసారు. ఈ చిత్రాన్ని ఈ సెప్టెంబర్ 12 నుంచి పాన్ సౌత్ భాషల్లో తెలుగు సహా తమిళ్, కన్నడ, మళయాళ భాషల్లో తీసుకొస్తున్నట్టుగా ఫిక్స్ చేసేసారు. ఇక ఈ చిత్రానికి రామ్ మిర్యాల,అజయ్ అరసాడ లు సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు