అక్కినేని ఫ్యామిలీ నుంచి తెలుగు సినిమాకి పరిచయం అయ్యిన హీరోస్ లో అఖిల్ అక్కినేనికి ఒక సెపరేట్ లీగ్ ఉందని చెప్పవచ్చు. మరి అఖిల్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడంటే దానికి ముందు సినిమాల ఫలితంతో సంబంధమే కాకుండా దానికి బిజినెస్ జరుగుతుంది. ఈ రేంజ్ లో అఖిల్ అదరగొడతాడు. అయితే తన లాష్క్ చిత్రం ఏజెంట్ తర్వాత నెక్స్ట్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకి అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది.
ఈ ఏప్రిల్ 8 అఖిల్ పుట్టినరోజు కానుకగా తన నెక్స్ట్ సినిమాపై అప్డేట్ ఉంటుంది అని బజ్ వచ్చిన సంగతి తెలిసిందే. మరి దీనిపై లేటెస్ట్ గా మ్యాడ్ ప్రొడ్యూసర్ నాగవంశీ అఫీషియల్ కన్ఫర్మ్ అప్డేట్ అందించారు. ఏప్రిల్ 8న అఖిల్ 6 అప్డేట్ వస్తుంది అని ప్రకటించారు. దీనితో ఇక ఆరోజు కోసం అఖిల్ అభిమానులు సహా అక్కినేని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
#Akhil6 – April 8th – ????????????
— Naga Vamsi (@vamsi84) April 5, 2025