“గేమ్ ఛేంజర్” టీజర్ బ్లాస్ట్, నెక్స్ట్ సాంగ్ పై అఫీషియల్ క్లారిటీ

“గేమ్ ఛేంజర్” టీజర్ బ్లాస్ట్, నెక్స్ట్ సాంగ్ పై అఫీషియల్ క్లారిటీ

Published on Sep 29, 2024 7:43 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మావెరిక్ దర్శకుడు శంకర్ అలాగే చరణ్ కెరీర్ లో ఇది 15వ సినిమా కాగా దీనిపై స్పెషల్ ఇంట్రెస్టింగ్ అయితే ఆడియెన్స్ లో ఉంది.

ఇక ఈ చిత్రం నుంచి ఇప్పుడు వరుస అప్డేట్స్ మెగా ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా రేపు సెకండ్ సింగిల్ గా రా మచ్చా రాబోతుంది. మరి ఈ సాంగ్ ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజుపై ప్లాన్ చేసిన ఇంట్రెస్టింగ్ ప్రోమోలో అదిరే అప్డేట్స్ ని తాను అందించారు. అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న గేమ్ ఛేంజర్ టీజర్ పై సాలిడ్ అప్డేట్ ఇస్తూ ఈ టీజర్ ని అక్టోబర్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు.

అలాగే అక్టోబర్ ఎండింగ్ లో మూడో సాంగ్ ఉంటుంది అని బ్యాక్ టు బ్యాక్ అదిరే అప్డేట్స్ ని తాను అందించారని చెప్పాలి. అలాగే నవంబర్ డిసెంబర్ వరకు ప్యాకెడ్ అప్డేట్స్ తో తాము సిద్ధంగా ఉన్నామని దిల్ రాజు క్లారిటీ ఇచ్చేసారు. సో మెగా ఫ్యాన్స్ ఇక సిద్ధంగా ఉండడమే తరువాయి అని చెప్పాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు