“యూఐ” ఓటిటి వార్తలపై అఫీషియల్ క్లారిటీ!

“యూఐ” ఓటిటి వార్తలపై అఫీషియల్ క్లారిటీ!

Published on Jan 8, 2025 3:01 PM IST

తెలుగు ఆడియెన్స్ మంచి క్రేజ్ ఉన్న సౌత్ హీరోస్ లో కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కూడా ఒకరు. మరి తన దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలకి మంచి ఆదరణ కూడా ఉంది. ఇలా తన నుంచి తన దర్శకత్వంలో హీరోగా కూడా చేసిన లేటెస్ట్ సినిమానే “యూఐ”. మరి తన మార్క్ క్రేజీ కాన్సెప్ట్ తో ఆడియెన్స్ కి దిమ్మ తిరిగేలా చేసిన ఈ సినిమా కన్నడ సహా తెలుగు ఆడియెన్స్ ఆదరణ అందుకుంది. అయితే ఈ సినిమాపై పలు రూమర్స్ అయితే ఓటిటికి సంబంధించి వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ సంస్థ సన్ నెక్స్ట్ వారు సొంతం చేసుకున్నారని అందులో త్వరలోనే సినిమా వస్తుంది అంటూ పలు రూమర్స్ వచ్చాయి. మరి వీటిపై సినిమా నిర్మాణ సంస్థలు క్లారిటీ ఇచ్చాయి. తమ యూఐ సినిమాపై వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆ ఓటిటి వార్తలని ఖండించారు. ఏదైనా సరే తమ నుంచే అఫీషియల్ గా క్లారిటీ వస్తుంది అని సో అప్పుడు వరకు వేచి ఉండాలని సూచిస్తున్నారు. మరి యూఐ ఓటిటి పార్ట్నర్, రిలీజ్ పై క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు