అఫీషియల్: పవర్ఫుల్ పోస్టర్ తో “దేవర” ట్రైలర్ విధ్వంసం డేట్ ఫిక్స్.!

అఫీషియల్: పవర్ఫుల్ పోస్టర్ తో “దేవర” ట్రైలర్ విధ్వంసం డేట్ ఫిక్స్.!

Published on Sep 7, 2024 11:27 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమా “దేవర” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు కొరటాల శివతో తారక్ చేస్తున్న రెండో సినిమా పైగా ఈసారి ఫుల్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించడంతో అంచనాలు మాత్రం పీక్స్ లో ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న అప్డేట్ ఏదన్నా ఉంది అంటే అది సినిమా ట్రైలర్ కోసమే అని చెప్పాలి.

మరి రీసెంట్ గా ఈ సెప్టెంబర్ 10న ఈ ట్రైలర్ వస్తుంది అని ప్రచారం కూడా జరగగా ఇప్పుడు మేకర్స్ దీనిని అఫీషియల్ గా అనౌన్స్ చేసేసారు. తారక్ పై దేవర లుక్ లో ఒక మాస్ అండ్ పవర్ఫుల్ పోస్టర్ ని రివీల్ చేసి ట్రైలర్ ఈ సెప్టెంబర్ 10నే వస్తున్నట్టుగా అనౌన్స్ చేసేసారు. సో తారక్ అభిమానులు ఈ బిగ్ డే కోసం వేచి చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వహిస్తున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు