అఫీషియల్: నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ “హను మాన్” దర్శకుడి యూనివర్స్ లోనే

అఫీషియల్: నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ “హను మాన్” దర్శకుడి యూనివర్స్ లోనే

Published on Sep 6, 2024 10:58 AM IST

నందమూరి నటసింహం నందమూరి బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా లాంచ్ అవ్వడం కోసం బాలయ్య అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మరి దాదాపు దశాబ్ద కాలానికి పైగానే వారంతా ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఎట్టకేలకి వారి నిరీక్షణకు తెర పడింది.

నేడు తన పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోనే హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్టుగా ఇప్పుడు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించేసారు. మరి హను మాన్ దర్శకుడు తమ సినిమాటిక్ యూనివర్స్ లోకి మోక్షు ని ఆహ్వానిస్తూ తనపై ఒక స్టైలిష్ పోస్టర్ ని పెట్టి విష్ చేసాడు.

అలాగే ఈ చిత్రాన్ని దసరా నిర్మాణ సంస్థ ఎస్ ఎల్ వి సినిమాస్ వారు అలాగే మోక్షజ్ఞ సోదరి నందమూరి తేజస్వినిలు నిర్మాణం వహిస్తుండడం విశేషం. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో తమ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఏ తరహా సినిమా రానుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు