లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ అలాగే యంగ్ హీరో సిద్ధార్థ్ కాంబినేషన్ లో చేసిన అవైటెడ్ సీక్వెల్ చిత్రమే “భారతీయుడు 2”. మరి శంకర్ కమల్ కాంబినేషన్ లో వచ్చిన భారీ హిట్ భారతీయుడు కి కొనసాగింపు సినిమాగా వచ్చిన ఈ చిత్రం డే 1 నుంచి అయితే అనుకున్న రేంజ్ హిట్ టాక్ ని సొంతం చేసుకోలేదు.
ఒకింత మిక్స్డ్ టాక్ తోనే స్టార్ట్ అయ్యిన ఈ చిత్రం రన్ టైం కూడా చాలా ఎక్కువ అయ్యింది అని కొన్ని మాటలు వచ్చాయి. అయితే వెంటనే సినిమాలో 20 నిమిషాలు కట్ చేసి మేకర్స్ ట్రిమ్ వెర్షన్ ని అందుబాటులో ఉంచుతున్నారని సమాచారం వచ్చింది. కానీ థియేటర్స్ లో నిన్నటి వరకు కూడా ఆ 3 గంటల సినిమానే కొనసాగింది.
అయితే ఇప్పుడు ఫైనల్ గా రన్ టైం ని తగ్గించడంపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. తమిళ్ సహా తెలుగు వెర్షన్ లో కూడా 20 నిమిషాలు కాదు కేవలం 12 నిముషాలు మాత్రమే కట్ చేసినట్టుగా అఫీషియల్ గా ఇప్పుడు అప్డేట్ అందించారు. సో ఆ 20 నిమిషాల వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.
Witness the enhanced version of #Bharateeyudu2 ????????✂️ Now presenting a streamlined edition trimmed by 12 min. Catch it in cinemas near you for a crisper experience! ????@IndianTheMovie ???????? Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh #Siddharth @actorsimha @anirudhofficial pic.twitter.com/68Ng1kks6q
— Asian Suresh Entertainment (@asiansureshent) July 17, 2024