అఫీషియల్: ఓటీటీ పార్ట్నర్ లాక్ చేసుకున్న “ఓజి”

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా దీనిపై భారీ హైప్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా దాదాపు పూర్తి కూడా అయ్యింది కానీ ఇంకొంచెం బ్యాలన్స్ ఉంది. అయితే ఈ పండుగ కానుకగా ఓజి పై సాలిడ్ అప్డేట్ వచ్చేసింది.

ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ గా దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. అలాగే పాన్ ఇండియా భాషల్లో హక్కులు వీరి దగ్గరే ఉన్నట్టుగా కూడా కన్ఫర్మ్ చేశారు. సో థియేటర్స్ రిలీజ్ తర్వాత నెట్ ఫ్లిక్స్ లో రానుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంకి థమన్ సంగీతం అందించగా డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version