కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” కోసం అందరికీ తెలిసిందే. మరి దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని విజయ్ కెరీర్ లో 68వ సినిమాగా చేశారు. అయితే ఈ చిత్రం తర్వాత విజయ్ తన కెరీర్ 69వ సినిమా చేసి ఇక సినిమాలు ఆపేస్తున్నట్టుగా తెలిపాడు.
దీనితో తన 69వ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఇప్పుడు మేకర్స్ ఈ సినిమాపై ఒకో అప్డేట్ ని అందిస్తూ వస్తున్నారు. అలా రీసెంట్ గానే బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్ ఈ సినిమాలో ఉన్నట్టుగా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించేసారు. ఇక గత కొన్ని రోజులు నుంచి ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఉందని పలు రూమర్స్ బయటకి వచ్చాయి.
మరి వీటిని నిజం చేస్తూ మేకర్స్ అధికారిక అనౌన్సమెంట్ ఇచ్చేసారు. దీనితో విజయ్ తో పూజా రెండోసారి జత కట్టనుండటం ఖరారయింది. ఇక ఈ చిత్రాన్ని కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే కన్నడ నిర్మాణ సంస్థ కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
Bringing the stunning duo back to the big screen once again ♥️
We know you’ve already cracked it, but officially…????
Welcome onboard @hegdepooja ????#Thalapathy69CastReveal#Thalapathy @actorvijay sir #HVinoth @thedeol @anirudhofficial @Jagadishbliss @LohithNK01 #Thalapathy69 pic.twitter.com/nzrtMdcw2l
— KVN Productions (@KvnProductions) October 2, 2024