ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమాని ఆల్రెడీ పలు పలు వాయిదాలు తర్వాత డిసెంబర్ 6కి ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ డేట్ లో కూడా కాదు కొంచెం ముందే సినిమా వస్తుంది అని ఆ మధ్య మేము తెలిపాము.
అయితే ఇప్పుడు ఫైనల్ గా మేకర్స్ ఆ బిగ్ అనౌన్సమెంట్ ని అఫీషియల్ గా ఇచ్చేసారు. నేడు జరిపిన నేషనల్ ప్రెస్ మీట్ లో పుష్ప 2 సినిమాని ఈ డిసెంబర్ 6న కాకుండా డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక అదిరే పోస్టర్ తో తెలిపారు. మరి ఇందులో బన్నీ సాలిడ్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. మొత్తానికి అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ టేకోవర్ డిసెంబర్ 5 నుంచి ఉంటుంది అని చెప్పాలి.