అఫీషియల్ : అజిత్ సినిమా నుంచి తప్పుకున్న ఈ దర్శకుడు.!

Published on Feb 4, 2023 9:00 am IST

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “తునివు” తన కెరీర్ లో మరో పెద్ద హిట్ అయ్యింది. ఈ పొంగల్ కానుకగా తమిళ నాట వచ్చిన ఈ చిత్రం తమిళ్ లో భారీ లాభాలు కూడా ఇచ్చింది అని అంటున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా హిట్ తర్వాత అజిత్ అయితే తన కెరీర్ లో 62వ సినిమాని ప్రముఖ భారీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారితో ఓకే చేయగా దీనిపై భారీ హైప్ నెలకొంది.

అయితే ఈ ప్రాజెక్ట్ ని దర్శకుడు విగ్నేష్ శివన్ తో ముందు అనౌన్స్ చేశారు. కానీ గత కొన్ని రోజులు నుంచి ఈ సినిమా దర్శకుడు మారుతాడని రూమర్స్ కూడా వచ్చాయి. మరి వీటిని అయితే ఈ దర్శకుడు నిజం తన సోషల్ మీడియా బయో లో అజిత్ 62 పేరు కూడా పెట్టుకున్నాడు కానీ దానిని లేటెస్ట్ గా తొలగించి అప్డేట్ చేసాడు. దీనితో ఈ సినిమాకి తాను డైరెక్ట్ చేయడం లేదని కన్ఫర్మ్ అయ్యిపోయింది. మరి కొత్త దర్శకుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :