ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన భారీ చిత్రం “హను మాన్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ సాలిడ్ ప్రమోషన్స్ కూడా ఇప్పుడు చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉండగా దర్శకుడు రీసెంట్ గానే సినిమా బిగ్ స్క్రీన్స్ పై చాలా బాగుంటుంది అని ప్రతి ఒక్కరు తప్పకుండా ఇష్టపడతారు అని నమ్మకంగా ఉన్నారు. అలాగే ఓటిటిలో కూడా సినిమా థియేటర్స్ లో వచ్చిన 60 రోజుల తర్వాత మాత్రమే వస్తుంది అని కన్ఫర్మ్ చేసాడు.
అయితే అసలు హను మాన్ హక్కులు ఏ స్ట్రీమింగ్ సంస్థ తీసుకుంది అనేది బయటకి రాలేదు. అయితే ఇప్పుడు దీనిపై అఫీషియల్ క్లారిటీ తెలిసిపోయింది. ఈ సినిమాని ప్రముఖ సంస్థ జీ 5 సంస్థ వారు కొనుగోలు చేసారు. దీంతో హను మాన్ ని పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ అందులో చూడవచ్చని చెప్పాలి.