సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘గుంటూరు కారం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం వెన్యూ లాక్ అయింది. రేపు సాయంత్రం 5 గంటల తర్వాత గుంటూరులోని నంబూరు ఎక్స్ రోడ్స్‌లో ఈ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్ కి భారీ సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉందని చిత్ర బృందం ప్రకటించింది. ఇక నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. యూట్యూబ్ లో అయితే, ఏకంగా 25 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాబట్టింది.
కాగా గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తోంది. ముఖ్యంగా మహేష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో త్రివిక్రమ్ ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తుండగా, థమన్ సంగీతం అందించారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జయరామ్, జగపతి బాబు, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.