యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “మెకానిక్ రాకీ” కోసం తెలిసిందే. అయితే ఈ చిత్రం మంచి టాక్ ని తెచుకున్నప్పటికీ ఆశించిన వసూళ్లు అందుకోలేదు. ఇక ఈ సినిమా తర్వాత తన నుంచి రానున్న చిత్రాల్లో దర్శకుడు “జాతి రత్నాలు” ఫేమ్ అనుదీప్ కేవీతో ఓ సినిమా కూడా ఉంది అని టాక్ ఉంది. అయితే మాస్ కా దాస్ తో ఇపుడు ఫైనల్ గా అఫీషియల్ అప్డేట్ ఇచ్చేసారు.
వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ తో ఈ చిత్రం అనౌన్స్ చేసేసారు. మరి ఈ చిత్రాన్ని “ఫంకీ” అంటూ ఒక సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అనౌన్స్ చేసేసారు. కల్కి 2898 ఎడి దర్శకుడు నాగ్ అశ్విన్ క్లాప్ తో నేడు సినిమా మొదలైంది.అలాగే విశ్వక్ తో ఆల్రెడీ సితార వారు “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది మరో సినిమా అని చెప్పాలి.
మరి ‘ప్రిన్స్” తర్వాత అనుదీప్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. దీనితో తన నుంచి కూడా సినిమా రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. మరి ఈ ఫంకీ ఎలాంటి నవ్వులు పూయిస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రం సంక్రాంతి తర్వాత నుంచి షూటింగ్ మొదలు పెట్టుకోనుంది.