ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రానున్న పలు భారీ చిత్రాల్లో ఆడియెన్స్ లో ఉండుండి అంతకంతకు హైప్ పెంచుకుంటూ వెళ్తున్న సాలిడ్ చిత్రాలు ఏవైనా ఉన్నాయి అంటే అవి పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం “సలార్” అలాగే మరోపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సెన్సేషనల్ చిత్రం “ఓజి”.
ఈ రెండు చిత్రాలు కూడా ఈ హీరోల కెరీర్ లో కానీ ఫ్యాన్స్ విషయంలో కానీ ఒక ఎక్స్ట్రీమ్ పీక్స్ లో ఉన్నాయి. ఎందుకంటే చాలా కాలం తర్వాత ప్రభాస్ నుంచి తన పర్సనాలిటీకి తగ్గ సరైన మాస్ చిత్రం ఇదే కావడం అలానే పవన్ కి కూడా తన సత్తాకి తగ్గ సరైన సినిమా కూడా ఓజి కావడం విశేషం.
దీనితో ఈ రెండు సినిమాలపై హైప్ మాములుగా లేదు. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు కూడా జస్ట్ కొన్ని రోజుల్లో వీడియో ట్రీట్ తో సందడి చేయనుండడంతో దాదాపు సోషల్ మీడియాలో అంతా కూడా ఈ రెండు చిత్రాల కోసమే హవా నడుస్తుంది. ఓ పక్క సలార్ ట్రైలర్ ఇంకోపక్క ఓజి గ్లింప్స్ కి కూడా అంతే హైప్ కనిపిస్తుంది. ఇక ఈ రెండు వచ్చాక ఫ్యాన్స్ ఏమైపోతారో చూడాలి మరి.