నైజాంలో మంచి వసూళ్లు సాధించిన ఓ మై ఫ్రెండ్

నైజాంలో మంచి వసూళ్లు సాధించిన ఓ మై ఫ్రెండ్

Published on Nov 21, 2011 10:44 AM IST


సిద్ధార్థ్ మరియు శృతి హాసన్ జంటగా నటించిన యూత్ ఫుల్ ఎంటర్తైన్మెంట్ చిత్రం “ఓ మై ఫ్రెండ్” నైజాం ఏరియాలో మంచి వసూళ్ళని సాధిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం మొదటి వారం నైజాం ఏరియాలో సుమారుగా 2.40 కోట్లు వసూలు చేసింది. అయితే మొదటగా ఈ చిత్రం 2.90 కోట్ల వరకూ వసూలు చేయొచ్చు అని అంచనా వేసారు. కానీ 2.40 కోట్లు మాత్రమే వసూలు చేస్తుంది. ఐనప్పటికీ సిద్ధార్థ్ కి మంచి వసూళ్లు అనే చెప్పుకోవచ్చు.

ఈ చిత్రానికి ఎ సెంటర్స్ లో విశేష ఆదరణ లభిస్తోంది ముఖ్యంగా యూత్ బాగా ఆదరిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి ప్రదర్శనలో నైజాం ఏరియా లో 3.75 కోట్ల వరకూ వసూలు చేయొచ్చు అని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్, శృతి హాసన్, హన్సిక మరియు నవదీప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహించారు.

రాహుల్ రాజ్ సంగీతం మరియు మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి విశేష స్పందన లభించింది. ఈ చిత్రానికి నిర్మాత దిల్ రాజు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు