సమీక్ష : ఒక పథకం ప్రకారం – పథకం రసవత్తరంగా సాగలేదు !

సమీక్ష : ఒక పథకం ప్రకారం – పథకం రసవత్తరంగా సాగలేదు !

Published on Feb 7, 2025 11:26 PM IST

విడుదల తేదీ : ఫిబ్రవరి 07, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : సాయిరాం శంకర్, శ్రుతి సోధి, ఆశిమ నర్వాల్, సముద్రఖని, రవి, పచముతు, భాను శ్రీ, గార్లపాటి కల్పలత, పల్లవి గౌడ

దర్శకుడు : వినోద్ కుమార్ విజయన్

నిర్మాతలు : వినోద్ కుమార్ విజయన్, గార్లపాటి రమేష్

సంగీతం :రాహుల్ రాజ్

సినిమాటోగ్రఫీ : రాజీవ్ రవి

ఎడిటర్ :కార్తీక్ జోగేశ్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

సాయిరాం శంకర్ హీరోగా వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక పథకం ప్రకారం సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

సిద్దార్థ్ నీలకంఠ (సాయి రామ్ శంకర్) ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్. తన భార్య సీత (ఆశిమా నర్వాల్) మిస్ అయిన తరువాత డ్రగ్స్‌కి బానిసవుతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సిద్దార్థ్‌తో కలిసి తిరిగే దివ్య (బిగ్ బాస్ భాను) క్రూరంగా హత్యకు గురవుతుంది. ఈ కేసులో ఏసీపీ రఘు రామ్ (సముద్రఖని) సిద్దార్థ్‌ను అనుమానిస్తాడు. అయితే ఆ తర్వాత కూడా మరో హత్య జరుగుతుంది. ఈ హత్యకు కూడా కారణం సిద్దార్థ్ నీలకంఠనే అని పోలీసులకు అనుమానం వచ్చేలా సాక్ష్యాలు దొరుకుతాయి. ఇంతకీ, ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు ?, అసలు సిద్దార్థ్ నీలకంఠ జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది ?, అతన్ని ఎవరు టార్గెట్ చేశారు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన ‘సాయిరాం శంకర్ తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ క్రైమ్ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించాడు. ప్రధానంగా కొన్ని కీలక సన్నివేశాల్లో తన తన పర్ఫార్మెన్స్‌తో సాయిరాం శంకర్ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశాడు. మరో ప్రధాన పాత్రలో నటించిన శ్రుతి సోధి కూడా చాలా బాగా నటించింది. హీరోయిన్ గా ఆశిమ నర్వాల్ మెప్పించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆమె నటన బాగుంది. ఇక సముద్రఖని నటన సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలిచింది.

ఇక మెయిన్ క్యారెక్టర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే క్రైమ్ ఎపిసోడ్స్ కూడా బాగానే ఉన్నాయి. అదేవిధంగా దర్శకుడు అమ్మాయిల హత్యల చుట్టూ అనేక కోణాల్లో సినిమాని నడిపిన విధానం కొన్ని చోట్ల బాగుంది. పచముతు, భాను శ్రీ, గార్లపాటి కల్పలత, పల్లవి గౌడ తదితరులతో పాటు ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మొత్తానికి సీరియస్ క్రైమ్ సన్నివేశాల్లోని డ్రామా కొన్ని చోట్ల బాగానే సాగింది.

మైనస్ పాయింట్స్:

ఈ ‘ఒక పథకం ప్రకారం’ సినిమాలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా ఉన్నా.. చాలా చోట్ల ప్లే మాత్రం చాలా సింపుల్ గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ బోర్ గా సాగాయి. ఫస్ట్ హాఫ్ ను ఇంకా బలంగా రాసుకుని ఉండాల్సింది. దీనికితోడు, అనవసరమైన ల్యాగ్ సీన్స్ కూడా ఎక్కువైపోయాయి. పైగా ఈ సినిమా స్లో నేరేషన్ తో పాటు బోరింగ్ ట్రీట్మెంట్ అండ్ ఫేక్ ఎమోషన్స్ తో సాగుతుంది.

సినిమా మొత్తం హత్యల చుట్టే తిరిగింది కాబట్టి, ఆ డ్రామాను ఇంకా బలంగా డిటైల్డ్ గా ఎస్టాబ్లిష్ చేసి కన్వెన్స్ చేయాల్సింది. మొత్తానికి ఫస్ట్ హాఫ్ లో కొన్ని కీలక సీన్స్ మరియు ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సీన్స్ ఆకట్టుకోవు. ఇక సెకండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు వినోద్ కుమార్ విజయన్ బాగానే ప్రయత్నం చేశాడు, కాకపోతే పూర్తి స్థాయిలో ఎక్కడా ఆ ఎమోషన్ వర్కౌట్ కాలేదు.

పైగా సిల్లీ ఎమోషన్స్ చుట్టూ పేలవమైన సీన్స్ తో సినిమాని సాగదీశారు. మొత్తమ్మీద ఈ ఒక పథకం ప్రకారం మూవీ మేకర్స్ తాము అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. కొన్ని సీన్స్ విషయంలో బాగాలేదు. అలాగే, క్లైమాక్స్ లోని సీన్స్ కూడా ఆకట్టుకోవు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు వినోద్ కుమార్ విజయన్ మంచి క్రైమ్ థ్రిల్లర్స్ కి గుడ్ ట్రీట్మెంట్ ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. ప్లే ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ బాగుంది. మూవీ ఓపెనింగ్ దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా నేచురల్ గా చూపించారు. రాహుల్ రాజ్ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకా బెటర్ ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాతలు వినోద్ కుమార్ విజయన్, గార్లపాటి రమేష్ ల ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

తీర్పు :

‘ఒక పథకం ప్రకారం’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ క్రైమ్ మిస్టరీ డ్రామా ఆకట్టుకోలేదు. కొన్ని క్రైమ్ సీన్స్ అండ్ ఫస్ట్ సీక్వెన్స్ బాగున్నప్పటికీ.. స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ సీన్స్ లేకపోవడం, కొన్ని కీలక సన్నివేశాల్లో లాజిక్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. మొత్తమ్మీద ఈ క్రైమ్ డ్రామా ప్రేక్షకులను అలరించలేకపోయింది.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు