త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “ఒకే ఒక జీవితం”


టాలీవుడ్ హీరో శర్వానంద్ హీరోగా, డైరెక్టర్ శ్రీ కార్తీక్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ఒకే ఒక జీవితం. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతోంది. త్వరలో ఈ చిత్రం జెమిని టీవీ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కానుంది.

అమల అక్కినేని, రీతూ వర్మ, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, సతీష్, రమేష్ తిలక్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జేక్స్ బెజాయ్ సంగీతం అందించగా, డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్. ఆర్ ప్రకాష్ బాబు, ఎస్. ఆర్ ప్రభు లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Exit mobile version