“ఓం భీమ్ బుష్” టీవీ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్!

“ఓం భీమ్ బుష్” టీవీ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్!

Published on Jun 23, 2024 8:52 PM IST


టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్ (Om Bheem bush) ఇటీవల థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. డిజిటల్ ప్రీమియర్ కూడా ఈ చిత్రం సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

ఈ చిత్రం శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఆదివారం స్టార్ మా లో సాయంత్రం 6:00 గంటలకు ప్రసారం కానుంది. శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ల పెర్ఫార్మెన్స్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్, మనీష్ కుమార్ మరియు రచ్చ రవి లు కీలక పాత్రల్లో నటించారు. బుల్లితెర పై ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు