“ఇంద్ర” రీరిలీజ్ లో మెగాస్టార్ ఫ్యాన్స్ కి మరో బిగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత

“ఇంద్ర” రీరిలీజ్ లో మెగాస్టార్ ఫ్యాన్స్ కి మరో బిగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత

Published on Aug 22, 2024 5:42 PM IST

తెలుగు చలన చిత్రం గర్వించదగ్గర నటుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం “ఇంద్ర” నేడు రీ రిలీజ్ కి వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో మళ్ళీ అభిమానులు తమ పాత రోజుల్లోకి వెళ్లిపోగా ఈ సినిమా స్మృతుల్ని వారితో పాటుగా చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరూ పంచుకుంటున్నారు. అలా తాజాగా దిగ్గజ నిర్మాత సి అశ్వనీదత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తి రేకెత్తించాయి. ఇంద్ర అనే సినిమా చిరంజీవితో చేయడం ఒక అదృష్టం అని వారు పేర్కొన్నారు.

ఈ ఉదయం మళ్ళీ ఇంద్ర కోసం వార్తలు వింటుంటే ఎంతో ఆనందంగా అనిపించింది అని తెలిపారు. ఇక దీనితో పాటుగా మరో ఊహించని గుడ్ న్యూస్ ని అయితే అందించారు. తాను తప్పకుండా చిరుతో సినిమా చేస్తున్నానని కన్ఫర్మ్ చేశారు. తమ కాంబినేషన్ లో 5వ సినిమా అతి త్వరలోనే ఉంటుంది అని తాను తెలిపారు. దీనితో ఇప్పుడు ఈ భారీ కాంబినేషన్ నుంచి ఈ స్పెషల్ డేన రివీల్ చేయడం మెగాస్టార్ అభిమానులకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి రీసెంట్ గానే అశ్వనిదత్ కల్కి 2898 ఎడి సినిమా చేసి సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు