బాక్సాఫీస్ దగ్గర రవితేజ, రామ్ పోతినేని స్పెషల్ క్లాష్.. ఈసారి ఎవరు?

బాక్సాఫీస్ దగ్గర రవితేజ, రామ్ పోతినేని స్పెషల్ క్లాష్.. ఈసారి ఎవరు?

Published on Jul 21, 2024 7:36 PM IST

ఈ ఏడాది మన టాలీవుడ్ సినిమా నుంచి రావాల్సిన భారీ చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2” (Pushpa 2) కోసం అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని మొదటిగా ఆగస్ట్ 15కి ప్లాన్ చేయగా ఈ డేట్ నుంచి మేకర్స్ డిసెంబర్ కి సినిమాని షిఫ్ట్ చెయ్యడంతో ఆగస్ట్ స్లాట్ లో చాలా సినిమాలే కన్నేశాయి. అయితే ఈ డేట్ లో ఇంట్రెస్టింగ్ క్లాష్ పడబోతోంది.

ఆల్రెడీ ఆగస్ట్ 15 రిలీజ్ కి యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన సాలిడ్ చిత్రం “డబుల్ ఇస్మార్ట్” (Double iSmart) తో రాబోతుండగా దీనిపై మంచి బజ్ నెలకొంది. అయితే తాజాగా ఈ చిత్రంతో మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్ “మిస్టర్ బచ్చన్” (Mr Bachchan) కూడా వస్తున్నట్టుగా ఫిక్స్ చేశారు. దీనితో ఇద్దరి మధ్య మరోసారి క్లాష్ పడబోతోంది అని కన్ఫర్మ్ అయ్యింది.

అయితే గతంలో కూడా ఈ ఇద్దరి స్టార్స్ నడుమ “రెడ్” అలాగే “క్రాక్” తో క్లాష్ పడ్డాయి రెండు కూడా మంచి హిట్ అయ్యాయి. కానీ క్రాక్ తో రవితేజ మరింత పెద్ద హిట్ స్కోర్ చేశారు. ఇక ఇప్పుడు మళ్ళీ ఇద్దరు రాబోతున్నారు. ఇక్కడ స్పెషల్ అంశం ఏమిటంటే అప్పుడు రామ్ రీమేక్ తో రవితేజ స్ట్రైట్ సినిమాతో వస్తే ఈసారి రవితేజ రీమేక్ తో రామ్ స్ట్రైట్ సినిమాతో రాబోతున్నాడు. మరి ఈసారి ఎవరు భారీ గ్రాసర్ ని అందుకుంటారో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు