మాస్ మహారాజ రవితేజ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమానే “మిస్టర్ బచ్చన్”. మరి డీసెంట్ బజ్ నడుమ ఈ సినిమా వచ్చినప్పటికీ రిలీజ్ తర్వాత ఈ సినిమా చాలా నెగిటివ్ తెచ్చుకుంది. అయితే మన టాలీవుడ్ లో ఉన్న పలు క్రేజీ కాంబినేషన్ లలో రవితేజ హరీష్ శంకర్ ల కాంబినేషన్ కూడా ఒకటి.
అయినా కూడా ఈసారి సినిమాకి మాత్రం విడుదల తర్వాత ఎందుకో బాగా నెగిటివ్ వచ్చింది. అయినప్పటికీ హరీష్ తమ కాంబినేషన్ నుంచి మరో సినిమా ఉంటుందని ప్రామిస్ చేస్తున్నాడు. దీనితో మళ్లీ ఈ అంశంపై నెటీజన్స్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఒకవేళ వీరి నుంచి నెక్స్ట్ సినిమా పడితే రీమేక్ కాకుండా మిరపకాయ్ లాంటి స్ట్రెయిట్ సినిమా పడితే ఏమన్నా మళ్ళీ ఆడియెన్స్ నుంచి మంచి అటెన్షన్ వస్తుందేమో చూడాలి.