“సీతా రామం” కి మరోసారి అదిరే రెస్పాన్స్.!

“సీతా రామం” కి మరోసారి అదిరే రెస్పాన్స్.!

Published on Sep 13, 2022 9:00 AM IST

యంగ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ అలాగే బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “సీతా రామం”. ఈ ఏడాది మన టాలీవుడ్ నుంచి వచ్చిన ఒక బెస్ట్ సినిమాగా మాత్రమే కాకుండా తెలుగు సినిమాలో ఒక మంచి సినిమాగా ఈ చిత్రం నిలిచింది.

అయితే థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక ఈ సినిమాకి ఎలాంటి ఎమోషనల్ స్పందన ఆడియెన్స్ నుంచి వచ్చిందో, ఇప్పుడు అదే విధంగా మరిన్ని భాషల్లో ఓటిటి లో రిలీజ్ అయ్యాక ఈ సినిమాపై ఆడియెన్స్ నుంచి అంతే రీతిలో అద్భుతమైన స్పందన ఈ చిత్రానికి వస్తుంది.

ఇప్పుడు తమిళ్ మరియు మళయాళ భాషల్లో ఈ సినిమాని చూసిన ఆడియెన్స్ సోషల్ మీడియాలో తమ స్పందన చెప్పకుండా ఉండలేకపోతున్నారు. రీసెంట్ టైం లో తాము చూసిన బెస్ట్ లవ్ స్టోరీ ఈ సినిమా అని చెబుతున్నారు. దీనితో అయితే మళ్ళీ ఈ సినిమాకి మేకర్స్ కి అదిరే రెస్పాన్స్ అందుతుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు