వైరల్ : మరోసారి తన ఉదారత చాటుకున్న విజయ్ దేవరకొండ

వైరల్ : మరోసారి తన ఉదారత చాటుకున్న విజయ్ దేవరకొండ

Published on Oct 31, 2023 10:00 AM IST

టాలీవుడ్ యంగ్ అండ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఇప్పుడు పలు సాలిడ్ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వాటిలో తన “ఫ్యామిలీ స్టార్” చిత్రం మంచి వైరల్ గా మారుతుండగా రీసెంట్ గా కీడా కోలా ప్రీ రిలీజ్ కి వచ్చి కూడా విజయ్ మంచి సందడి చేసాడు. అయితే సినిమా పరంగా విజయ్ ని పక్కన పెడితే తాను పర్శనల్ గా ఎంతో మందికి సాయం చేయడం స్టార్ట్ చేసాడు.

అప్పుడు కరోనా సమయం నుంచి ఇప్పుడు వరకు కూడా అనేక సందర్భాల్లో చాలా మందికి అండగా నిలిచిన విజయ్ తన గత చిత్రం ఖుషి సమయంలో కూడా ఏకంగా ఒక కోటి రూపాయలు 100 కుటుంబాలకి ఒకో లక్ష చొప్పున పంచి తన పెద్ద మనసు చాటుకున్నాడు. అయితే తాజాగా మరో ఆసక్తికర ఇన్సిడెంట్ కోసం బయటకి వచ్చింది.

శ్రీకాకుళం కి చెందిన కోటబొమ్మాళి ప్రాంతంలో ఓ చిన్నారి రోడ్డు ప్రమాదంలో తన కాలుని పోగొట్టుకున్న విషయం విజయ్ దృష్టికి రాగా తాను వివరాలు కనుక్కొని ఒక లక్ష రూపాయల ఆర్ధిక సాయాన్ని ఆ చిన్నారి కుటుంబానికి అందించాడు. దీనితో ఈ విషయం ఇప్పుడు ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. దీనితో ఈ వార్త విన్న విజయ్ ఫ్యాన్స్ తమ హీరో పట్ల మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు