మన టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “ఖుషి” తో చాలా ఏళ్ల తర్వాత ఒక బిగ్ హిట్ ని అయితే తన ఖాతాలో వేసుకున్నాడు. దీనితో ఈ చిత్రం తన కెరీర్ లోనే మంచి హిట్ గా నిలిచి దూసుకెళ్తుండగా విజయ్ అయితే లేటెస్ట్ గా చేసిన ఓ పని మరోసారి తన ఉదారతను చాటి చెప్పుతుంది.
ఆ మధ్య విజయ్ కోవిడ్ సమయంలో చేసిన వినూత్న సేవా కార్యక్రమాలు మెయిన్ గా రానున్న రోజుల్లో యువతకి అండగా ఉండాలని చేసిన ప్రణాళికలు చాలా మందికి సాయం కూడా అందించడం జరిగింది. అయితే ఈ తర్వాత తన ఆర్గాన్స్ అన్నీ డొనేట్ చేసి ఎంతోమందికి విజయ్ ప్రేరణగా కూడా నిలిచాడు. మరి మరోసారి అయితే విజయ్ తన గొప్ప మనసు చాటుకొని ప్రశంసలు అందుకుంటున్నాడు.
తన ఖుషి సినిమా హిట్ అయ్యిన సందర్భంగా ఆ సినిమాకి వచ్చిన వసూళ్ల నుంచి ఒక కోటి రూపాయలను తన దేవర కుటుంబాలకి ఒకో లక్ష రూపాయలు చొప్పున తాను సాయం అందించనున్నట్టుగా డిసైడ్ అయ్యాడు. ఇది నాకు రియల్ సక్సెస్ లా భావిస్తున్నాను అని తాను తెలిపాడు. దీనితో విజయ్ ఈ స్టేట్మెంట్ తో మరోసారి అందరి హృదయాలు గెలుచుకున్నాడు.