మరో మారు మహేష్ సాంగ్ కి దుమ్మురేపిన వార్నర్.

Published on May 31, 2020 7:56 pm IST

క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరో బ్యాంగ్ వీడియోతో వచ్చేశాడు. నిన్న మైండ్ బ్లాక్ సాంగ్ లోని ఓ పార్ట్ కి వీడియో చేసిన ఆయన, నేడు అదే సాంగ్ నుండి పార్ట్ 2 విడుదల చేశారు. వార్నర్ మరియు అతని వైఫ్ కాండీస్ వార్నర్ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మాస్ సాంగ్ కి రెచ్చిపోయి స్టెప్స్ వేశారు. పక్కన డేవిడ్ వార్నర్ పిల్లలు కూడా ఈ సాంగ్ లో జాయిన్ అయ్యారు.

కృష్ణ పుట్టిన రోజు కానుకగా మహేష్ నెక్స్ట్ మూవీ సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ తో మహేష్ ఫ్యాన్స్ ని ఫిదా చేయగా వార్నర్ కూడా వారికి ఈ విధంగా మరో గిఫ్ట్ ఇచ్చారు. సదరు వీడియోకి మహేష్ ఫ్యాన్స్ లైక్స్ మరియు కామెంట్స్ తో విరుచుకు పడుతున్నారు. తెలుగు హీరోల జీవితాలలో ముఖ్య కార్యక్రమాలు గుర్తు పెట్టుకొని వార్నర్ ఇలా వీడియోలు చేయడం విశేషం అనుకోవాలి.

సంబంధిత సమాచారం :

More