మరో సీరియల్ నటుడికి కరోనా.. !

Published on Jul 4, 2020 12:44 pm IST

బుల్లి తెరనటులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే నలుగురు సీరియల్ యాక్టర్స్ కి కరోనా సోకడం జరిగింది. ప్రభాకర్, హరికృష్ణ, నవ్య స్వామి మరియు రవి కృష్ణ లకి కరోనా వైరస్ సోకింది.తాజాగా మరో టీవీ నటుడు సాక్షి శివ ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడ్డాడు . అక్క మొగుడు, నెంబర్‌ వన్ కోడలు, మౌనరాగం వంటి సీరియల్స్‌లో నటిస్తున్న శివకు కరోనా పాజిటివ్ అని తెలియగానే ఆయనతో నటించిన నటీనటులలో భయాందోళనలు నెలకొన్నాయి.

కరోనా గైడ్ లైన్స్ పాటిస్తూ షూటింగ్స్ చేస్తున్నప్పటికీ, కేసులు వస్తుండడం అందరిని ఆందోళన గురిచేస్తుంది. వరుసగా కేసులు నమోదు అవుతుండగా…షూటింగ్స్ నిలిపివేశారు. దీనితో మరో మారు చిత్ర పరిశ్రమ పూర్తి లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. ఇక సినిమా షూటింగ్ సరే సరి. స్టార్ హీరోలు షూటింగ్ కి ససేమిరా అంటున్నారు. హైదరాబాద్ లో కరోనా వ్యాప్తి అంత కంతకు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుంది.

సంబంధిత సమాచారం :

More