ఈ డాషింగ్ బ్యాట్స్ మెన్ బన్నీ ఫ్యాన్ అయిపోయాడు

ఈ డాషింగ్ బ్యాట్స్ మెన్ బన్నీ ఫ్యాన్ అయిపోయాడు

Published on May 12, 2020 4:56 PM IST

ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ వరుస వీడియోలు చేస్తూ వార్తలో నిలుస్తున్నాడు. ఆయనకు సౌత్ సినిమా మేనియా పట్టింది. అల వైకుంఠపురంలో సినిమా నుండి కొద్దిరోజుల క్రితం బుట్ట బొమ్మ సాంగ్ కి సతీసమేతంగా డాన్స్ చేస్తూ టిక్ టాక్ వీడియో చేసిన వార్నర్ నేడు, అదే సినిమాలోని మరో సూపర్ హిట్ సాంగ్ కి స్టెప్స్ వేసి అలరించాడు. అల వైకుంఠపురంలో సినిమాలోని మాస్ బీట్ సాంగ్ రాములో రాములా… సాంగ్ కి భార్యతో కలిసి డాన్స్ వేశాడు. ఆ వీడియోని తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు.

ఓ ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న స్టార్ క్రికెటర్ ఇలా బన్నీ సాంగ్స్ కి వరుస వీడియోలు చేయడం ఆయన ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది. అలాగే డేవిడ్ వార్నర్… మహేష్, పూరి జగన్నాధ్ ల బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పోకిరి సినిమాలోని ఫేమస్ డైలాగ్ ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను..’ అనే డైలాగ్ కూడా చెప్పారు. ప్రస్తుతం డేవిడ్ వార్నర్ వీడియోలు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి.

https://www.instagram.com/p/CAFSOiupg-E/?igshid=f1d46toa95hl

సంబంధిత సమాచారం

తాజా వార్తలు