యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక గ్రాండియర్ పాన్ ఇండియన్ మూవీ ఆర్ ఆర్ ఆర్. ఈ ఏడాది మార్చి 25న విడుదలైన ఈ మూవీ ఎంతో భారీ విజయం అందుకుని అత్యధిక కలెక్షన్స్ అందుకుంది. అలానే పలువురు హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు నుండి సైతం గొప్ప ప్రశంసలు దక్కించుకుంది. ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించగా కొమురం భీంగా ఎన్టీఆర్ కనిపించిన విషయం తెలిసిందే. ఇక రామరాజు భార్య సీతగా బాలీవుడ్ నటి అలియా భట్ నటించారు.
అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్కసెకండ్ హాఫ్ లో భర్త రామరాజు కోసం హత్రాస్ కి వచ్చిన సీత, ఆయన తన స్నేహితుడి కోసం బంధింపబడ్డారని అలానే రెండు రోజుల్లో ఆయనని ఉరి తీస్తున్నారనే విషయాన్ని భీం కుటుంబానికి చెప్పడం జరుగుతుంది. అనంతరం తానే ఆ స్నేహితుడిని, రామరాజు గొప్పతనాన్ని గుర్తించలేకపోయానని అని భీం చెప్తారు. ఆడియన్స్ మనసుని తాకే ఈ సీన్ లో ఎన్టీఆర్, అలియా భట్ ఇద్దరూ ఎంతో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసారు.
ఇక మొత్తం ఈ ఘటన అంతా కూడా నైట్ ఎఫెక్ట్ లో ఒక సత్రం సెట్టింగ్ లో తీశారు. అయితే ఈ అద్భుత సీన్ తాలూకు కాన్సెప్ట్ ఆర్ట్, టెస్ట్ షూట్, ఫైనల్ షాట్ ఫోటోలని కొద్దిసేపటి క్రితం ఆర్ఆర్ఆర్ యూనిట్ తమ అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. ఆ పిక్స్ ని బట్టి చూస్తే దర్శకడు జక్కన్న ఆ ఒక్క సీన్ ని మాత్రమే కాదు ప్రతి సీన్ ని ఎంత అద్భుతంగా అలోచించి తెరకెక్కించారు అనేది మనకు అర్ధం అవుతుంది.