నాని లాంచ్ చేయనున్న ‘ఓ వెన్నెల’ సాంగ్

నాని లాంచ్ చేయనున్న ‘ఓ వెన్నెల’ సాంగ్

Published on Jan 3, 2025 3:01 AM IST

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘భైరవం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు విజయ్ కనకమేడల ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటిస్తున్నారు.

కాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ‘ఓ వెన్నెల’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌ను జనవరి 3న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా, ఈ పాటను న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.

ఇక ఈ పాటను బెల్లంకొండ శ్రీనివాస్, అదితి శంకర్‌లపై చిత్రీకరించారు. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా కెకె.రాధామోహన్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు