అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఊరికి ఉత్తరాన’


ప్రస్తుతం ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ లో పలు సినిమాలు సిరీస్ లు ఆడియన్స్ ని అలరిస్తుండగా, తాజాగా ఊరికి ఉత్తరాన అనే లవ్ యాక్షన్ మూవీ అందరినీ ఆకట్టుకుంటోంది. నరేన్ వనపర్తి, దీపాళి శర్మ నటించిన ఊరికి ఉత్తరాన మూవీని తన బృందంతో కలిసి సతీష్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీని వనపర్తి వెంకటయ్య నిర్మించారు. ఈ మూవీ ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రేమతోపాటు, ఆసక్తి రేకెత్తించే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయన్నారు. హీరో నరేన్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం వరంగల్ సెట్ వేసి చిత్రీకరణ చేశాం. అది సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మనసుల్ని హత్తుకునే కథ, కథనాలతో రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులకి చక్కటి వినోదం పంచుతుంది. కాగా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం రూ.79 చెల్లించి ఈ సినిమా ఇంటిల్లిపాది చూడొచ్చు. మూవీ చూసిన పలువురు ఆడియన్స్ పాజిటివ్ రెస్పాన్స్ అందిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఈగల్ ఐ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ఓ కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నట్లు తెలిపారు నరేన్. మొత్తంగా తమ సినిమా ఆడియన్స్ ని అలరిస్తుండడంతో యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

Exit mobile version