సమీక్ష : “ఊరు పేరు భైరవకోన” – కొన్ని చోట్ల ఆకట్టుకునే హారర్ డ్రామా !

సమీక్ష : “ఊరు పేరు భైరవకోన” – కొన్ని చోట్ల ఆకట్టుకునే హారర్ డ్రామా !

Published on Feb 17, 2024 3:03 AM IST
Ooru Peru Bhairavakona Movie Review in Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 16, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, పి. రవిశంకర్ తదితరులు

దర్శకుడు : వీఐ ఆనంద్‌

నిర్మాత: రాజేశ్‌ దండా

సంగీత దర్శకులు: శేఖర్ చంద్ర

సినిమాటోగ్రఫీ: రాజ్ తోట

ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్

సంబంధిత లింక్స్: ట్రైలర్

హీరో సందీప్ కిషన్ లేటెస్ట్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

బసవ (సందీప్ కిషన్) తన స్నేహితుడు జాన్ (వైవా హర్ష)తో కలిసి ఓ దొంగతనం చేస్తాడు. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకుంటూ అనుకోకుండా భైరవకోన అనే ఊరిలోకి వస్తారు. ఐతే, ఈ ఇద్దరితో పాటు గీత ( కావ్య థాపర్) కూడా ఆ ఊర్లోకి వస్తోంది. ఇంతకీ, ఆ భైరవకోన ఊరు ప్రత్యేకత ఏమిటి ?, అక్కడ కనిపించే మనుషులు ఎవరు ?, ఈ మధ్యలో బసవ – జాన్ – గీత.. ఆ భైరవకోనలో ఎలాంటి విచిత్ర పరిస్థితులను ఎదుర్కొన్నారు ?, మొత్తంగా ఈ ముగ్గురి జీవితాలు భైరవకోనలో ఎలాంటి మలుపులు తిరిగాయి ?, ఈ మొత్తం వ్యవహారంలో వర్ష బొల్లమ్మ పాత్ర ఏమిటి ?, ఇంతకీ, గరుడ పురాణం లో మిస్ అయిన నాలుగు పేజీలకు – భైరవకోనకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

చనిపోయిన వారి ఆత్మలు ద్వేషంతో రగిలిపోతూ.. పగ కోసం ఎదురుచూస్తూ ఉంటే ఎలా ఉంటుంది ? అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ఎమోషనల్ హారర్ రివేంజ్ డ్రామాలో కొన్ని ఎమోషన్స్ అండ్ మెయిన్ కథాంశం బాగున్నాయి. అలాగే ఈ ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాలో కోర్ పాయింట్ కూడా బాగుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన బసవ పాత్ర .. ఆ పాత్రకి సంబంధించిన ఎమోషనల్ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన వర్ష బొల్లమ్మ పాత్ర.. ఆమెకు జరిగిన అన్యాయం, దానికి సందీప్ కిషన్ చేసే రిస్క్.. ఇలా మొత్తానికి ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా కొన్ని చోట్ల పర్వాలేదు.

ఈ సినిమాలో హీరోగా నటించిన సందీప్ కిషన్ తన పాత్రకు తగ్గట్లు బాగానే నటించాడు. హీరోయిన్ వర్ష బొల్లమ్మ తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అలాగే, మరో కీలక పాత్రలో నటించిన కావ్య థాపర్ కూడా బాగానే నటించింది. స్నేహితుడి పాత్రలో వైవా హర్ష నటన బాగుంది. ఇక వెన్నెల కిషోర్, పి. రవిశంకర్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

కథలో ఎంత కల్పన అయినా ఉండొచ్చు. కానీ, కథే పూర్తి కల్పన అయితే, ఆ కల్పనలో అబ్బురపరిచే విషయాలు ఉండాలి, నమ్మశక్యం కానీ సంఘటనలను కూడా నమ్మేలా చిత్రీకరించాలి. కానీ, ఈ ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాలో అది పూర్తిగా మిస్ అయ్యింది. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర చనిపోయే సన్నివేశం మరీ సిల్లీగా అనిపిస్తోంది. అయినా, దెయ్యాలు, ఆత్మలు కథలు తెలుగు సినిమాకి కొత్తేమీ కాదు. దీనికి తోడు, ‘భైరవకోన’లోని హారర్ ఎఫెక్ట్స్ కూడా బాగా రెగ్యులర్ అయిపోయాయి. గాలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

అయితే, దర్శకుడు ఫస్ట్ హాఫ్ పై ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ… అదే విధంగా అతను రాసుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. సినిమాలో చాలా చోట్ల లాజిక్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా మిస్ కావడం, మరియు బోరింగ్ ప్లే ఎక్కువ అవ్వడం వంటి అంశాల కారణంగా ఈ సినిమా బాగాలేదు. మొత్తమ్మీద ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

సాంకేతిక విభాగం :

సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథనం ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర సమకూర్చిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ రాజ్ తోట సీన్స్ ను తెరకెక్కించిన విధానం బాగుంది. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఈ చిత్ర నిర్మాత రాజేశ్‌ దండా పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

‘ఊరు పేరు భైరవకోన’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ హారర్ అండ్ రివేంజ్ డ్రామాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ – కొన్ని హారర్ ఎలిమెంట్స్ బాగున్నాయి. ఐతే, కథనం స్లోగా సాగడం, కొన్ని కీలక కీలక సన్నివేశాల్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రమే కనెక్ట్ అవుతుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

Ooru Peru Bhairavakona Movie Reviews and Ratings, Sundeep Kishan, Kavya Thapar, Varsha Bollamma, Ooru Peru Bhairavakona Movie Reviewసమీక్ష : "ఊరు పేరు భైరవకోన" - కొన్ని చోట్ల ఆకట్టుకునే హారర్ డ్రామా !