సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన ఊరు పేరు భైరవకోన చిత్రం ఫిబ్రవరి 16, 2024 న థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. మల్టిపుల్ జానర్‌ల మేళవింపుతో తెరకెక్కిన ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. వర్షా బొల్లమ్మ, కావ్యా థాపర్ ఇందులో కథానాయికలుగా నటించారు. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.
ఈ చిత్రం జూన్ 30, 2024 న సాయంత్రం 6:00 గంటలకు ప్రముఖ టీవీ ఛానల్ అయిన జీ తెలుగు లో ప్రసారం కానుంది. ఇందులో వైవా హర్ష, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రానికి భాను భోగవరపు కథ అందించగా, శేఖర్ చంద్ర బాణీలు సమకూర్చారు. బుల్లితెర పై ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.