ఇంట‌ర్వ్యూ: ‘ఆపరేషన్ రావణ్’ ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుంది – హీరో రక్షిత్ అట్లూరి

ఇంట‌ర్వ్యూ: ‘ఆపరేషన్ రావణ్’ ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుంది – హీరో రక్షిత్ అట్లూరి

Published on Jul 23, 2024 9:33 PM IST

పలాస, నరకాసుర చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రక్షిత్ అట్లూరి. ఆయన హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం “ఆపరేషన్ రావణ్” ఇప్పటికే రిలీజ్ కు రెడీ అయ్యింది. వెంకట సత్య డైరెక్ట్ చేస్తున్న‌ ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ గురించి హీరో ర‌క్షిత్ కుమార్ మీడియాతో పంచుకున్నారు.

* పలాస టైమ్ నుంచి మా నాన్న‌గారు కథా చర్చల్లో పాల్గొనేవారు. కథ అనుకున్న తర్వాత సెట్స్ మీదకు వెళ్లేందుకు చాలా టైమ్ దొరికింది. అప్పుడు నేను నరకాసుర, శశివదనే అనే రెండు సినిమాలు చేస్తున్నా. ఈ రెండు సినిమాలు కంప్లీట్ చేసేప్పటికి “ఆపరేషన్ రావణ్” కథను బాగా డెవలప్ చేసేంత టైమ్ దొరికింది. పర్పెక్ట్ స్క్రిప్ట్ అయ్యాక సెట్స్ మీదకు వెళ్లాం.

* నాన్నగారి డైరెక్షన్ పట్ల రాధిక, చరణ్ రాజ్ లాంటి సీనియ‌ర్ యాక్ట‌ర్స్ హ్యాపీగా ఫీలయ్యారు. వాళ్లందరినీ సంతృప్తిపరచడం అంత ఈజీ కాదు. దర్శకుడిగా ప్రతిభ చూపిస్తేనే అది సాధ్యమవుతుంది. రాధిక గారు మా మూవీకి బాగా సపోర్ట్ చేశారు. తండ్రి దర్శకత్వంలో నటించే అవకాశం ఎంతమంది పిల్లలకు వస్తుందో తెలియదు. ఆయన డైరెక్షన్ లో నటించడం సంతోషంగా ఉంది.

* “ఆపరేషన్ రావణ్” సినిమాను ఎక్కువ మంది ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా సిల్వర్ కాయిన్ గిఫ్ట్ ఇస్తున్నామని ప్రకటించాం. సినిమా చూసి ఫస్టాఫ్ లోగా సైకో ఎవరన్నది కనిపెడితే వారికి సిల్వర్ కాయిన్ ఇవ్వబోతున్నాం.

* “ఆపరేషన్ రావణ్” సినిమాలో మెసేజ్ ఏమీ ఉండదు. మనలో ఆలోచనల అంతర్యుద్ధాన్ని ఇప్పటిదాకా ఎవరూ స్క్రీన్ మీద చూపించలేదు. మా సినిమాలో అలాంటి ప్రయత్నం చేశాం. ఒక‌ సైకో తన ఆలోచనలను విజువలైజ్ చేసే సీన్ చూస్తూ ఆడియెన్స్ ట్రాన్స్ లోకి వెళ్తారు.

* పలాస, నరకాసుర చేసిన తర్వాత అన్నీ సీరియస్ రోల్స్ చేస్తున్నాననే అంటున్నారు. కానీ “ఆపరేషన్ రావణ్”, శశివదనే సినిమాలు నన్ను కొత్తగా చూపిస్తాయి. ఈ సినిమా న‌న్ను ఆడియెన్స్ కు మరింత దగ్గర చేస్తుంది.

* “ఆపరేషన్ రావణ్” చిత్రంలో నేను ఆనంద్ శ్రీరామ్ అనే టీవీ రిపోర్టర్ క్యారెక్టర్ చేస్తున్నాను. బైక్ సీక్వెన్స్ లో కంటెయినర్ మీదకు దూకే యాక్షన్ సీన్ లో గాయాలయ్యాయి. ఈ సినిమాలో ఒక యూనిక్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది.

* రాధిక గారితో నటించడం మర్చిపోలేని ఎక్సీపిరియన్స్. ఆమెతో మాట్లాడటమే ఇన్స్ పైరింగ్ గా ఉండేది. ఆమె చాలా తక్కువగా మాట్లాడుతుంటారు.

* పలాసతో వచ్చిన సక్సెస్ ను ఇంకా బ్రైట్ గా యూజ్ చేసుకోవాల్సింది. అయితే పలాస తర్వాత రెండేళ్లు కోవిడ్ రావ‌డం.. నరకాసుర సినిమాకు ఒక ఫిక్స్డ్ గెటప్ లో ఉండిపోవ‌డం వ‌ల్ల‌ వేరే సినిమాలు చేయలేకపోయాను. అయితే ఇప్పుడు “ఆపరేషన్ రావణ్”, నెక్ట్స్ వస్తున్న శశివదనే సినిమాలు జాగ్రత్తగా చేస్తున్నా.

* “ఆపరేషన్ రావణ్” సినిమాకు వసంత్ చాలా చ‌క్క‌టి బీజీఎం ఇచ్చారు. మంచి అట్మాస్ థియేటర్ లో మా మూవీ చూస్తే బాగా కనెక్ట్ అవుతారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు