మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో, శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కిన ఏరియల్ యాక్షన్ డ్రామా ఆపరేషన్ వాలెంటైన్. మానుషి చిల్లర్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం మార్చి 1, 2024న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.
ప్రముఖ టెలివిజన్ ఛానెల్ అయిన జెమినీ టీవీ ఈ సినిమా కి సంబందించిన శాటిలైట్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానుంది. నవదీప్, రుహాని శర్మ, మీర్ సర్వర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.