టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. చివరి సారిగా గాండీవధారి అర్జున చిత్రం లో కనిపించారు వరుణ్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేక పోయింది. ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ తో ప్రేక్షకులని అలరించడానికి రెడీ అవుతున్నాడు. మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 8, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం కి సంబందించిన సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు మేకర్స్. ఆపరేషన్ వాలెంటైన్ స్కై హై రివీల్ అంటూ చెప్పుకొచ్చారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా మేకర్స్ విష్ చేస్తూ, పోస్టర్ ను విడుదల చేసారు. పోస్టర్ విశేషం గా ఆకట్టుకుంటుంది. తెలుగు మరియు హిందీ భాషలలో రిలీజ్ కానున్న ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.