సమీక్ష : “ఓపెన్‌హైమర్” – అద్భుతమైన ఫిజిక్స్ సైంటిస్ట్ బయోగ్రఫీ

Oppenheimer Movie Review in Telugu

విడుదల తేదీ : జూలై 21, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.75/5

నటీనటులు: సిలియన్ మర్ఫీ, ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్ పగ్, జోష్ హార్ట్‌నెట్, కేసీ అఫ్లెక్, రామి మాలెక్, కెన్నెత్ బ్రానాగ్

దర్శకుడు : క్రిస్టోఫర్ నోలన్

నిర్మాతలు: ఎమ్మా థామస్, చార్లెస్ రోవెన్, క్రిస్టోఫర్ నోలన్

సంగీతం: లుడ్విగ్ గోరాన్సన్

సినిమాటోగ్రఫీ: హోయ్టే వాన్ హోటెమా

ఎడిటర్: జెన్నిఫర్ లేమ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

జీనియస్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఓపెన్‌హైమర్‌తో. ఇది ప్రపంచవ్యాప్తంగా నేడు థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా అందుకు తగినట్లుగా ఉందో లేదో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

 

కథ:

 

లెస్లీ గ్రోవ్స్ (మాట్ డామన్), యూఎస్ ఆర్మీ కార్ప్స్ కి చెందిన ఇంజనీర్స్ అధికారి, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో థియోరిటికల్ ఫిజిక్ సైంటిస్ట్ అయిన J. రాబర్ట్ ఓపెన్‌హైమర్ (సిలియన్ మర్ఫీ)ని అటామిక్ బాంబ్ (అణు బాంబు) తయారు చేయమని అడిగాడు. ఓపెన్‌హైమర్ మరియు ఇతర శాస్త్రవేత్తలు దీనిని అభివృద్ధి చేశారు. దీనిని యూఎస్ ప్రభుత్వం తరువాత యుద్ధంలో ఉపయోగించింది. తరువాత, ఓపెన్‌హైమర్ ను “ఫాదర్ ఆఫ్ ది అటామిక్ బాంబ్” అని పిలవడం జరిగింది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత, ఓపెన్‌హైమర్‌పై విచారణ జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది? ఓపెన్‌హైమర్ తర్వాత ఏమి చేస్తాడు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు చిత్రం లో ఉన్నాయి.

 

ప్లస్ పాయింట్స్:

 

ఎన్నో గొప్ప కథలకు ప్రసిద్ధి చెందిన క్రిస్టోఫర్ నోలన్, ఫాదర్ ఆఫ్ ది అటామిక్ బాంబ్ యొక్క ఎమోషనల్ జర్నీ ను అద్భుతంగా చిత్రించాడు. అతను A-బాంబు తయారీపై మాత్రమే కాకుండా, దానిని సృష్టించిన ఓపెన్‌హైమర్ జీవితంపై దృష్టి సారిస్తూ మంచి స్టోరీ ను అందించారు.

సిలియన్ మర్ఫీ ఒపెన్‌హైమర్‌గా అద్భుతమైన ప్రదర్శనను అందించాడు. ఫిజిక్స్ సైంటిస్ట్ గా పాత్రలో ఉండే క్లిష్ట సన్నివేశాల్లో చాలా అద్భుతంగా గా నటించాడు.

రాబర్ట్ డౌనీ జూనియర్ అద్భుతమైన నటన కనబరిచారు. నెగటివ్ రోల్ అయిన లూయిస్ స్ట్రాస్‌ పాత్రలో నటించి, ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నారు.

ఒపెన్‌హైమర్‌ భార్య కిట్టి పాత్రలో ఎమిలీ బ్లంట్ బాగా నటించింది. అయితే ఫ్లోరెన్స్ పగ్, మాట్ డామన్, ఇతర నటినటుల పర్ఫార్మెన్స్ సినిమాకి మరింత ప్లస్ అయ్యింది.

లాస్ అలమోస్‌లో అణు బాంబు పేలుడును CGI లేకుండా చూపించడం జరిగింది. ఇది మొత్తం చిత్ర యూనిట్ సాధించిన గొప్ప విజయం. ఈ సన్నివేశం, సినిమాలో కీలకం గా, ఆకర్షణీయం గా ఉంటుంది.

యుద్ధం తరువాత వచ్చే ఒపెన్‌హైమర్ యొక్క ప్రసంగం, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ (టామ్ కాంటి)తో జరిగే సంభాషణలు, డైలాగ్స్ చాలా బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్:

 

సినిమా 3 గంటల రన్‌టైమ్ ను కలిగి ఉంది. ఇది చూసే కొంతమంది ప్రేక్షకులకి విసుగు తెప్పించవచ్చు. అయితే స్టోరీ లో లేనమైన వారు రన్ టైమ్ ను అంతగా పట్టించుకోరు.

స్క్రీన్‌ప్లేలో కొన్ని డిఫరెంట్ టైమ్ లైన్స్ ను ఉపయోగించడం, ఓపెన్‌హైమర్ జీవితం గురించి తక్కువ నాలెడ్జ్ ఉన్న ఆడియెన్స్ కి ఛాలెంజింగ్ గా ఉంటుంది. అయితే ఈ సైంటిస్ట్ గురించి కొంత బ్యాక్ గ్రౌండ్ నాలెడ్జ్ ఉన్నవారు మరింత గా సినిమాను అర్దం చేసుకొనే అవకాశం ఉంది.

మొదటి గంట లో ఎక్కువగా డ్రామా ఉంది. అయితే ఇది సెకండాఫ్ లో కూడా సినిమా పై ప్రభావం చూపుతుంది. ఒకే రంగులో ఉండే సన్నివేశాలు ఆడియెన్స్ కి అంతగా నచ్చక పోవచ్చు. పాత్రల గురించి, ఓపెన్‌హైమర్ కథ గురించి తెలియని వారు గందరగోళానికి గురి అయ్యే అవకాశం ఉంది.

 

సాంకేతిక విభాగం:

 

డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ ఓపెన్‌హైమర్ చిత్రం, ప్రధాన పాత్ర జీవితంలోని హెచ్చు తగ్గులను పూర్తిగా వివరిస్తుంది. అతని ప్రతిభ ను పూర్తి స్థాయిలో చూపించడం జరిగింది.

సౌండ్ డిజైన్ మరియు సినిమాటోగ్రఫీతో సినిమా చాలా రిచ్ గా ఆకట్టుకుంది. అయితే ఎడిటర్ కొన్ని అనవసరమైన సన్నివేశాలను తొలగించి మొదటి భాగం ఇంకా బాగుండేది. ముఖ్యంగా CGI లేకుండా అటామిక్ బాంబ్ పేలుడును చూపించడం లో లాంటి సన్నివేశాలతో నిర్మాణ విలువలు ఏ రేంజ్ లో ఉన్నాయి అనేది తెలుస్తుంది.

 

తీర్పు:

 

డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ మరోసారి ఓపెన్‌హైమర్ చిత్రం తో తన సత్తా చాటారు. ప్రధాన పాత్రలో నటించిన సిలియన్ మర్ఫీ నటన అద్భుతం గా ఉంది. అతని నటనతో సినిమా మరో లెవెల్ కి వెళ్ళింది. డిఫరెంట్ టైమ్ లైన్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు ఆడియెన్స్ కి కాస్త గందరగోళం గా అనిపిస్తాయి. వీటిని విస్మరిస్తే, ఈ వీకెండ్ నోలన్ యొక్క అద్భుతమైన స్టోరీ ను ఆస్వాదించవచ్చు.

123telugu.com Rating: 3.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version