మోస్ట్ అవైటెడ్ ‘సీతారామం’ ఓఎస్టి రిలీజ్ …!

Published on Sep 21, 2022 10:08 pm IST


హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన హ్రద్యమైన లవ్, రొమాంటిక్, ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ సీతారామం. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కనిపించిన ఈ మూవీలో రష్మిక మందన్న కీలక రోల్ చేయగా విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించారు. రిలీజ్ రోజు నుండి సూపర్ హిట్ టాక్ తో అత్యద్భుతమైన కలెక్షన్స్ తో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సీతారామం మూవీ ప్రస్తుతం అటు హిందీలో కూడా రిలీజ్ అయి అక్కడి ఆడియన్స్ మనసు కూడా దోచుకుంటోంది.

ఇక ఇటీవల ఓటిటి ద్వారా బుల్లితెర ఆడియన్స్ ముందుకి వచ్చిన సీతారామం మంచి వ్యూస్ ని రాబడుతోంది. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ నుండి అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యూజికల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (ఓఎస్టి) ని కొద్దిసేపటి క్రితం యూనిట్ అఫీషియల్ గా రిలీజ్ చేసింది. ఇప్పటికే ఈ మూవీ సాంగ్స్ అందరి నోటా వినపడుతూ ఎంతో పాపులర్ అయిన విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :