ఓటిటి : ట్రోల్స్ నుంచి సాలిడ్ డిమాండ్ ఉన్న హీరోగా నాని


టాలీవుడ్ సినిమా దగ్గర తనదైన సహజమైన నటనతో నాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకొని ఇప్పుడు టైర్ 2 లో టాప్ హీరోస్ లో ఒకడిగా ఎమెర్జ్ అయ్యిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాని. మరి తన స్వశక్తితో మంచి స్టార్డం తెచ్చుకున్న నాని ఇప్పుడు మంచి విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఇక రీసెంట్ గానే హాయ్ నాన్న సినిమాతో అదరగొట్టిన నాని ఇప్పుడు “సరిపోదా శనివారం” తో తన బర్త్ డే కానుకగా ఓ మాస్ ట్రీట్ ని అయితే తాను ఆడియెన్స్ కి ప్రామిస్ చేసాడు.

అయితే బిగ్ స్క్రీన్స్ బాక్సాఫీస్ దగ్గర మాత్రమే కాకుండా నానికి ఇప్పుడు ఓటిటి లో కూడా సాలిడ్ మార్కెట్ నెలకొనడం విశేషం. అప్పట్లో నాని కొన్ని చిత్రాలు తప్పనిసరి పరిస్థితుల్లో ఓటిటి రిలీజ్ కి వస్తే కొన్ని ట్రోల్స్ కూడా తనపై వచ్చాయి. కానీ ఇదే ఓటిటిలో ఇప్పుడు నాని చిత్రాలు ధియేటరికల్ హక్కులు కాకుండానే సాలిడ్ ఆఫర్స్ ని అందుకుంటున్నాయి.

అలాగే రీసెంట్ గా వచ్చిన హాయ్ నాన్న హిందీ వెర్షన్ అయితే ఓటిటిలో ఇప్పుడుకి కూడా ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతుంది అంటే తన సినిమాలకి థియేటర్స్ లో భారీ వసూళ్లు రావడంతో పాటుగా ఆ చిత్రాలకి ఓటిటిలో కూడా ఎంత ఆదరణ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ కారణం చేతనే నాని చిత్రాలు ఇప్పుడు ఓటిటి లో కూడా సాలిడ్ డిమాండ్ నెలకొంది. అలా ట్రోల్స్ నుంచి ఇప్పుడు ఓటిటి లో మంచి డిమాండ్ ఉన్న హీరోగా నాని తన జర్నీలో తన మార్కెట్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు.

Exit mobile version