ఈ దీపావళి కానుకగా పండుగని ఇంకాస్త ముందే థియేటర్స్ లోకి తీసుకొచ్చిన సినిమాల్లో టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన సాలిడ్ ఎంటర్టైనర్ సినిమా “లక్కీ భాస్కర్” కూడా ఒకటి. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా పైడ్ ప్రీమియర్స్ తోనే సాలిడ్ టాక్ ని సొంతం చేసుకొని అదరగొట్టింది. ఇక థియేటర్స్ లో లక్కీ భాస్కర్ బ్లాస్ట్ ఖచ్చితంగా కొన్నాళ్ళు కొనసాగుతుంది అని అర్ధం అయ్యిపోయింది.
కానీ ఈ తర్వాత ఓటీటీ కోసం కూడా క్లారిటీ వచ్చింది. పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ ఈ సినిమా దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రానుంది. దీని అఫీషియల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ గా వారు లాక్ అయ్యారు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.