మన టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా దర్శకుడు గ్యారీ బి హెచ్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “స్పై” కోసం తెలిసిందే. మరి ఇండియాస్ బెస్ట్ కెప్ట్ సీక్రెట్ కాన్సెప్ట్ పై తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా ఈరోజే గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ అవైటెడ్ సినిమా యూఎస్ లో సాలిడ్ ఓపెనింగ్స్ కూడా అందుకోగా ఇక ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ హక్కులు కోసం తెలుస్తుంది.
ఈ చిత్రం ఓటిటి రైట్స్ ని అయితే ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నారు. దీనితో థియేటర్స్ లో రన్ తర్వాత ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో ఓటిటి వెర్షన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండనుంది. ఇక ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్, రానా దగ్గుబాటి. అభినవ్ గోమతం తదితరులు కీలక పాత్రల్లో నటించగా ఈడీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.